యాసిడ్ దాడికి గురైన ఓ అమ్మాయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'ఛపాక్'. ప్రముఖ హీరోయిన్ దీపికా పదుకొణె టైటిల్ రోల్లో నటిస్తోంది. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ప్రేక్షకులను ఉద్వేగానికి గురిచేసేలా ఉన్న ఈ ప్రచార చిత్రాన్ని చూస్తే... యాసిడ్ దాడి బాధితురాలి పాత్ర కోసం దీపిక చాలా కష్టపడిందని అర్ధమవుతోంది.
మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మిస్తోంది. వచ్చే జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది ఛపాక్.