తెలంగాణ

telangana

By

Published : Jun 14, 2019, 9:01 PM IST

ETV Bharat / sitara

'చాంగు భళా.. చాంగు భళా.. ఇలాగా'

సమంత హీరోయిన్​గా నటిస్తున్న 'ఓ బేబీ' సినిమాలో చాంగు భళా అంటూ సాగే లిరికల్ పాట విడుదలైంది. జులై 5న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

'చాంగు భళా.. చాంగుభళా.. ఇలాగా'

సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'ఓ బేబీ'. ఇటీవల వచ్చిన టీజర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. సినిమాలోని ‘చాంగు భళా’ అంటూ సాగే పాటను చిత్రబృందం విడుదల చేసింది. ఇప్పటికే వచ్చిన రెండు పాటలు సంగీత ప్రియుల్ని అలరిస్తున్నాయి. వినూత్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా జులై 5న రానుంది.

సీనియర్ నటి లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు నిర్మిస్తున్నారు. నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు.

కొరియన్ సినిమా 'మిస్ గ్రానీ'కి రీమేక్​గా తెరకెక్కిందీ చిత్రం. 70 ఏళ్ల వృద్ధురాలి ఆత్మ 20 సంవత్సరాల యువతి శరీరంలోకి ప్రవేశించడం అనే కథతో ఈ సినిమాను రూపొందించారు.

ఇది చదవండి: సక్సెస్​ మీట్​లో ఏడ్చిన హీరోయిన్​- కారణం ఇదే!

ABOUT THE AUTHOR

...view details