Gangubai kathiawadi release issue: ఆలియా భట్ కీలక పాత్రలో నటించిన చిత్రం 'గంగుబాయి కతియావాడి'. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఈ చిత్రం విడుదల కాకుండా నిలిపివేయాలని పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో సదరు పిటిషన్‌లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. సినిమాను పేరు మార్చాల్సిందిగా భన్సాలీ ప్రొడక్షన్స్‌ను సూచించింది.
ఆలియా 'గంగూబాయి..' పేరు మార్చాలని సుప్రీంకోర్టు సూచన - alia Gangubai movie issue
Alia bhatt gangubai: 'గంగూబాయి..' సినిమాపై వేసిన పలు పిటిషన్లను పరిశీలించిన న్యాయస్థానం.. మూవీ పేరు మార్చాలని చిత్రబృందాన్ని ఆదేశించింది. ఈ సినిమా శుక్రవారం రిలీజ్‌కు రెడీగా ఉంది.

ఆలియా గంగూబాయి మూవీ
గంగూబాయి దత్తత కుమారుడినంటూ బాబు రాజీవ్ షా ఈ పిటిషన్ దాఖలు చేశారు. తన తల్లిని అవమానకర రీతిలో చూపించారంటూ ఆరోపించారు. దీనిపై తుది విచారణను గురువారం జరపనున్నట్లు న్యాయస్థానం తెలిపింది. ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ హుస్సేన్ జైదీ రాసిన 'మాఫియా క్వీన్ ఆఫ్ ముంబయి' పుస్తకం ఆధారంగా 'గంగూబాయి కతియావాడి'ని తెరకెక్కిస్తున్నారు.
ఇవీ చదవండి: