తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మార్పు స్థిరమైంది' అంటోన్న సుశాంత్ - అల వైకుంఠపురములో

'కాళిదాసు' సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన అక్కినేని హీరో సుశాంత్. ప్రస్తుతం అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఈ హీరో పోస్ట్ చేసిన ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

Change
సుశాంత్

By

Published : Dec 23, 2019, 7:24 PM IST

సాధారణంగా కథానాయకులు తమ కొత్త లుక్‌లను, సినిమా పోస్టర్‌లను కాని సామాజిక మాధ్యమాల్లో పెట్టి క్యాప్షన్‌ పెడుతుంటారు. వీటికి భిన్నంగా యంగ్‌ హీరో సుశాంత్‌ మాత్రం ఒక కొత్త ఫొటోను ట్విట్టర్‌ వేదికగా పంచుకుని "మార్పు మాత్రమే స్థిరమైనది" అంటూ రాసుకొచ్చాడు. పైగా ఇందులో బాలీవుడ్‌ కథానాయకులలాగా చొక్కా లేకుండా, స్టైలిష్‌ లుక్‌లో, రొమాంటిక్‌ చూపులతో సరికొత్తగా కనిపిస్తున్నాడు.

సుశాంత్

సుశాంత్‌ 'అల వైకుంఠపురములో' సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు. కొత్తగా 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' అనే చిత్రాన్ని మొదలుపెట్టాడు. తాజాగా విడుదల చేసిన ఈ లుక్‌ ఈ సినిమా కోసమా? లేక మరో సినిమా కోసమా? అనే విషయం తెలీదు. ప్రస్తుతం చొక్కా లేని సుశాంత్‌ రొమాంటిక్‌ రూపం మాత్రం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ఇవీ చూడండి.. 'భేదాలను భస్మం చేసేవాడే సైనికుడు'

ABOUT THE AUTHOR

...view details