టాలీవుడ్ అభిమానులు మెచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో 'కార్తికేయ' ఒకటి. చిన్న చిత్రంగా వచ్చినా, విశేష ఆదరణ దక్కించుకుంది. హీరోగా నటించిన నిఖిల్.. విమర్శకుల మెప్పు పొందాడు. మాతృకను తీసిన దర్శకుడు చందూ మొండేటి.. ఇప్పుడు దీనికి సీక్వెల్ తీసేందుకు సిద్ధమవుతున్నాడు. ముద్దుగుమ్మలు అనుపమ పరమేశ్వరన్, నభా నటేశ్ ఇందులో హీరోయిన్లుగా ఎంపికయ్యారని సమాచారం.
'కార్తికేయ' సీక్వెల్లో ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు! - నభానటేశ్ కొత్త సినిమా
హీరో నిఖిల్ నటించే 'కార్తికేయ' సీక్వెల్లో టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు ముద్దుగుమ్మలు అవకాశం దక్కించుకున్నారట. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది చిత్రబృందం.
'కార్తికేయ' సీక్వెల్లో ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు!
'కార్తికేయ' తొలి భాగంలో నటించిన కలర్స్ స్వాతి.. ఇందులోనూ ప్రధాన పాత్ర పోషించనుంది. ఈమెతో పాటే అనుపమ, నభా నటించనున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమాకు టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇదీ చదవండి: అందరి చేత 'నచ్చావులే' అనిపించుకుంటోన్న శేఖర్ చంద్ర
Last Updated : Feb 28, 2020, 2:55 AM IST