కరోనా వ్యాప్తి కారణంగా చిత్రీకరణకు దూరంగా ఉన్న యువ కథానాయకుడు నిఖిల్.. త్వరలోనే సెట్లో అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయన హీరోగానటిస్తోన్న కొత్త చిత్రం 'కార్తికేయ 2' షూటింగ్ ఈ నెలలో తిరిగి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన స్క్రిప్టు వర్క్‌ను దర్శకుడు చందూ మొండేటి శరవేగంగా పూర్తి చేస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోను డైరక్టర్ సోషల్‌మీడియాలో షేర్ చేశారు.
'కార్తికేయ 2'కు రంగం సిద్ధం.. త్వరలోనే షూటింగ్! - చందూ మొండేటి వార్తలు
యువ కథానాయకుడు నిఖిల్ త్వరలోనే షూటింగ్లో పాల్గొననున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'కార్తికేయ 2' స్క్రిప్ట్ వర్క్‌ను దర్శకుడు చందూ మొండేటి పూర్తి చేసే పనిలో ఉన్నారు. దానికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. త్వరలోనే చిత్రీకరణ మొదలుపెడతామని తెలిపారు.
'కార్తికేయ 2'కు రంగం సిద్ధం.. త్వరలోనే షూటింగ్!
'కార్తికేయ 2' పురాణాల నేపథ్యంలో సుమారు 5 వేల ఏళ్ల నాటి వాస్తవిక సంఘటనలు ఇందులో ప్రస్తావిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో నటిస్తున్న నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి:ట్రైలర్: కొత్త సంకల్పానికి 'శ్రీకారం'