తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పవన్​ 'హరిహర..' కోసం చాందినీ చౌక్​ సెట్ - Pawan kalyan bheemla nayak movie

Hari hara veera mallu movie: పవన్​ కొత్త సినిమా కోసం చారిత్రక సెట్​ను నిర్మించేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. కొత్త షెడ్యూల్​ అంతా ఇందులోనే సాగనుందని సమాచారం.

pawan kalyan hari hara veera mallu movie
పవన్ హరిహర వీరమల్లు మూవీ

By

Published : Jan 21, 2022, 6:59 AM IST

Pawan kalyan movies: పవర్​స్టార్ పవన్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న 'హరిహర వీరమల్లు' కోసం మరో సెట్‌ నిర్మించేందుకు చిత్రబృందం సన్నాహాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. మొఘల్‌ కాలం నేపథ్యంలో సాగే కథతో ఆ చిత్రం తెరకెక్కుతోంది. అప్పటి వాతావరణం ప్రతిబింబించేలా పలు చారిత్రక కట్టడాల్ని సెట్స్‌గా తీర్చిదిద్దుతూ, ఆ నేపథ్యంలోనే చిత్రీకరణ చేస్తున్నారు.

అందులో భాగంగానే చాందినీ చౌక్‌ సెట్‌ను నిర్మించే ప్రయత్నాలు మొదలయ్యాయని సమాచారం. కొత్త షెడ్యూల్‌ చాందినీ చౌక్‌ నేపథ్యంలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది.

చాందినీ చౌక్ సెట్

క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. పవన్‌కల్యాణ్‌కు జోడీగా నిధి అగర్వాల్‌ నటిస్తోంది. ఎ.దయాకర్‌రావు, ఎ.ఎమ్‌.రత్నం నిర్మాతలు. బాలీవుడ్‌ తారలు అర్జున్‌ రాంపాల్‌, నర్గీస్‌ ఫక్రీ కూడా ఇందులో నటిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details