ప్రముఖ చిత్రకారుడు కరతోలువు శివశంకరన్ (96) ఈ రోజు మరణించారు. చందమామ శంకరన్గా ఆయన సుప్రసిద్ధులు. వార్ధక్యంతో చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూశారు. 1951లో చందమామలో చేరి 60 ఏళ్లపాటు పనిచేశారు శంకరన్. చందమామ చిత్రకారుల బృందానికి నేతృత్వం వహించారు. చందమామ ముఖచిత్రం డిజైన్‌లోనూ ప్రముఖపాత్ర పోషించారు.
ప్రముఖ చిత్రకారుడు 'చందమామ శివశంకరన్' కన్నుమూత
ప్రముఖ చిత్రకారుడు కరతోలువు శివశంకరన్ ఈ రోజు కన్నుమూశారు. వార్ధక్యంతో చెన్నైలో తుదిశ్వాస విడిచిన ఆయన.. చందమామ శంకరన్గా పేరు తెచ్చుకున్నారు.
ప్రముఖ చిత్రకారుడు 'చందమామ శివశంకరన్' కన్నుమూత
చందమామలో బేతాళ కథలు బాగా ప్రసిద్ధి. సంస్థ మూతపడ్డాక "రామకృష్ణ విజయం" పత్రికలో చిత్రకారుడుగా పనిచేశారు శంకరన్. పలు మ్యాగజైన్లకు చిత్రాలు గీశారు. శంకరన్ మృతిపట్ల పలువురు చిత్రకారులు సంతాపం వ్యక్తం చేశారు.
Last Updated : Sep 29, 2020, 10:09 PM IST