ఆదివారం జరిగిన 45వ టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో భారతీయ దర్శకుడు చైతన్య తమ్హానే రూపొందించిన 'ది డిసిపుల్' చిత్రం సత్తాచాటింది. ఈ సినిమాకుగానూ యాంప్లిఫై వాయిస్ అవార్డును దక్కించుకున్నాడు చైతన్య. 'నైట్ ఆఫ్ ద కింగ్స్' చిత్ర దర్శకుడు ఫిలిప్ లాకోట్తో ఈ పురస్కారాన్ని పంచుకున్నాడు.
టొరంటో చిత్రోత్సవంలో భారతీయ దర్శకుడికి అవార్డు - దర్శకుడు చైతన్య తమ్హనే వార్తలు
భారతీయ దర్శకుడు చైతన్య తమ్హానే రూపొందించిన 'ది డిసిపుల్' చిత్రం 45వ టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో సత్తా చాటింది. ఆదివారం జరిగిన ఈ వేడుకలో యాంప్లిఫై వాయిస్ పురస్కారానికి ఎంపికయ్యాడు దర్శకుడు చైతన్య.
![టొరంటో చిత్రోత్సవంలో భారతీయ దర్శకుడికి అవార్డు Chaitanya Tamhane's The Disciple wins again, this time at TIFF](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8876634-118-8876634-1600651454516.jpg)
టొరంటో అంతర్జాతీయ చిత్రోత్సవంలో భారతీయ దర్శకుడి ఘనత
వెనిస్ గోల్డెన్ లయన్ విజేత అమెరికన్-చైనీస్ దర్శకురాలు క్లోయి జావో(నోమాడ్లాండ్ సినిమాకు) టిఐఎఫ్ఎఫ్కు చెందిన పీపుల్స్ ఛాయిస్ అవార్డు సొంతం చేసుకుంది. ఇది ఆస్కార్ అవార్డులకు ఎంపికవ్వడానికి సూచికగా పరిగణిస్తారు.
Last Updated : Sep 21, 2020, 9:12 AM IST