పెళ్లి తర్వాత సమంత, నాగచైతన్య కలిసి నటిస్తోన్న చిత్రం మజిలీ. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ స్టిల్ విడుదలైంది. చైతూ, సమంత బస్సు ఫుట్‌బోర్డుపై నిల్చుని కనిపించారు. 'లవ్ అండ్ పెయిన్'తో మ్యాజికల్ జర్నీకి సిద్ధం అవ్వండంటూ దర్శకుడు ట్వీట్ చేశాడు. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న 9గంటల 9 నిమిషాలకు సినిమా టీజర్ విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 5న మజిలీని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
చైతూసామ్ 'మజిలీ'
టాలీవుడ్ సక్సెస్ఫుల్ జోడీ సమంత, చైతన్య 'మజిలీ' సినిమాలో నటిస్తున్నారు. వీరిద్దరి కొత్తలుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా చిత్ర టీజర్ రానుంది.
చైతూసామ్ 'మజిలీ'
ఇప్పటికే చిత్రబృందం రెండు స్టిల్స్ విడుదల చేసింది. తొలి లుక్‌లో సమంతతో కనువిందు చేసిన నాగచైతన్య...రెండోసారి దివ్యాంశ కౌశిక్ అనే మరో కథానాయికతో సందడి చేశాడు. గడ్డంతో ఒకసారి, క్లీన్ షేవ్‌తో బ్యాట్పట్టుకొని మరోసారి కనిపించాడు చైతూ.