దివంగత హాలీవుడ్ నటుడు చాడ్విక్ బోస్మన్ మరణాంతరం ఓ పురస్కారానికి ఎంపికయ్యారని సమాచారం. 2021 ఏడాదికి గానూ ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డుకు ఆయన నామినేట్ అయినట్లు తెలుస్తోంది. పీపుల్స్ మ్యాగ్జైన్ నివేదిక ప్రకారం.. ఏప్రిల్లో జరగనున్న ఈ 36వ ఇటరేషన్ ఆఫ్ ది అవార్డ్స్ వేడుకలో ఇండిపెండెంట్ స్పిరిట్ పురస్కారానికి బోస్మన్ ఓ నామినీగా ఎంపికయ్యారు.
గతేడాది విడుదలైన 'మా రైనీస్ బ్లాక్ బాటమ్' చిత్రంలో బోస్మన్ నటనకూ ఈ అవార్డుల వేడుకలోని ఉత్తమ నటుడు పురస్కార నామినేషన్లలో నిలిచారు. ఈ పురస్కారాల ప్రదాన వేడుక ఏప్రిల్ 22న నిర్వహించనున్నారు.