తెలంగాణ

telangana

By

Published : Sep 21, 2020, 2:35 PM IST

ETV Bharat / sitara

అలరిస్తోన్న 'చావు కబురు చల్లగా' టీజర్​

టాలీవుడ్ యువ హీరో కార్తికేయ ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'చావు కబురు చల్లగా'. నేడు కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్​ను విడుదల చేసింది చిత్రబృందం.

Chaavu Kaburu Challaga teaser released
అలరిస్తోన్న 'చావు కబురు చల్లగా' టీజర్​

టాలీవుడ్​ యువ హీరో కార్తికేయ ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'చావు కబురు చల్లగా'. కౌశిక్​ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను.. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఫస్ట్​లుక్​ పోస్టర్​ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు.

నేడు కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా ఈ సర్​ప్రైజ్ ఇచ్చింది చిత్రబృందం. డిఫరెంట్ యాస పలుకుతూ ఆకట్టుకున్నాడు కార్తికేయ. ఇందులో శవాల్ని తీసుకువెళ్లే బండి డ్రైవర్​గా కనిపిస్తున్నాడీ హీరో. ఇతడికి తల్లిగా సీనియర్ నటి ఆమని కనిపించింది. టీజర్ చూస్తుంటే కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు అర్థమవుతోంది.

ABOUT THE AUTHOR

...view details