సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల్లో సీట్ల సామర్థ్యాన్ని నూరు శాతానికి పెంచేందుకు ఈ నెల 27న గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన కేంద్రప్రభుత్వం.. ఆదివారం(నేడు) అధికారికంగా ప్రకటించింది. కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ వీటికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశారు.
ఫలితంగా దేశంలోని పలు ప్రాంతాల్లో థియేటర్లు తెరుచుకోన్నాయి. కరోనా వైరస్ పరిస్థితుల రీత్యా 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు పునఃప్రారంభించుకోవడానికి గతేడాది అక్టోబర్‌లో కేంద్రం ఓకే చెప్పింది.
ప్రేక్షకులు కూడా ఇప్పుడిప్పుడే హాళ్లలో అడుగుపెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వ్యాక్సిన్ పంపిణీ, కరోనా తగ్గుముఖం పడుతోన్న తరుణంలో థియేటర్ యాజమాన్యానికి చేయూతనందించే విధంగా నూరుశాతం ఆక్యుపెన్సీకి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అనుమతులిచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి నూరుశాతం ఆక్యుపెన్సీతో థియేటర్లలో సినిమాలు ప్రదర్శించవచ్చు అని ప్రకటించింది. కరోనా నియంత్రణలో భాగంగా గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని యాజమాన్యాలకు కేంద్రం సూచించింది.
మెరుగైన కంటెంట్
ఓటీటీలో నడుస్తున్న కొన్ని సీరియల్స్ పై అభ్యంతరాలు తెలుపుతూ.. చాలా ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు జావడేకర్. అటువంటి వాటిపై శ్రద్ధ చూపుతున్నామని, త్వరలో చర్యలు కూడా తీసుకుంటామని అన్నారు. వార్తలను ప్రసారం చేసే విషయంలో.. మెరుగైన కంటెంట్ ఉండేలా
ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
మార్గదర్శకాలు..
1. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి వందశాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు తెరుచుకోవచ్చు.