హీరో విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్'.. ఈ వాలంటైన్స్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్, పోస్టర్, పాటలతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం యూఏ సర్టిఫికెట్‌ను సొంతం చేసుకుంది. అయితే టీజర్లో వినిపించిన ఓ డైలాగ్‌ను, సినిమాలో తొలగించారు సెన్సార్ సభ్యులు. వాటితో పాటే కొన్ని అసభ్యకర పదాలు బ్లర్ చేయాలని యూనిట్‌కు సూచించారు.
'వరల్డ్ ఫేమస్ లవర్'లో ఆ 'డైలాగ్' వినపడదు - విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్
'వరల్డ్ ఫేమస్ లవర్' టీజర్లో పాపులరైన ఓ డైలాగ్‌ను, సినిమాలో తొలిగించాలని చెప్పారు సెన్సార్ సభ్యులు. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
హీరో విజయ్ దేవరకొండ
ఈ సినిమాలో రాశీఖన్నా, కేథరిన్, ఐశ్వర్య రాజేశ్, ఇస్బెల్లా హీరోయిన్లుగా నటించారు. గోపీసుందర్ సంగీతమందించాడు. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించాడు. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కేఎస్ రామారావు నిర్మాతగా వ్యవహరించారు.
Last Updated : Feb 29, 2020, 9:36 PM IST