'పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ తగ్గేదే లే!' అని అంటున్నారు అగ్రకథానాయకుడు చిరంజీవి. గురువారం అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలుపుతూ చిరు ఓ ట్వీట్ చేశారు. బుధవారం విడుదలైన 'పుష్ప' టీజర్‌ను తాను చూశానని చిరు తెలిపారు. టీజర్ ఊరమాస్ లెవల్‌లో ఉందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు సైతం బన్నీకి బర్త్‌డే విషెస్ తెలిపారు.
"పుష్ప' టీజర్ చూశాను. వాస్తవానికి దగ్గరగా ఊరమాస్‌గా ఉంది. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ తగ్గేదే లే! నా ప్రియమైన బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు"
- చిరంజీవి, కథానాయకుడు
"హ్యాపీ బర్త్‌డే అల్లు అర్జున్!! అదృష్టం నిన్ను వరించాలని, సంతోషం, విజయం ఎప్పుడూ నీతో ఉండాలని కోరుకుంటున్నాను. 'పుష్ప' టీజర్ ఎంతో అద్భుతంగా ఉంది. సినిమా కోసం ఎదురుచూస్తున్నా"
- రవితేజ, కథానాయకుడు
"సినిమా పట్ల మీకున్న అభిరుచి, నిబద్ధత, ప్రేమే మిమ్మల్ని ఐకాన్‌స్టార్‌గా మార్చాయి. మీరు ఇలాగే ఎంతోమందిలో స్ఫూర్తినింపాలని ఆశిస్తున్నా. 'పుష్ప' టీజర్ ఎంతో బాగుంది. హ్యాపీ బర్త్‌డే ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్"
- శ్రీనువైట్ల, దర్శకుడు
"హ్యాపీ బర్త్‌డే బగ్సీ! ఈ ఏడాదంతా నీకు అత్యద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను."
- కాజల్ అగర్వాల్, కథానాయిక