ఆర్థిక సమస్యలు, ప్రేమ విఫలం, ఒత్తిడి, మోసాలు, విరక్తి వంటి తాత్కాలిక సమస్యల్ని ఎదుర్కోలేక చిన్న వయసులోనే తనువు చాలించిన తారలు కొందరైతే.. అనారోగ్య కారణంతో ఆకస్మికంగా మృతి చెందినవారు సినీ ప్రముఖులు మరికొందరు. ఈ జాబితాలో నాటి సిల్క్‌స్మిత, సావిత్రి నుంచి నేటి బాలీవుడ్ నటులు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సిదార్థ్ శుక్లా వరకు ఉన్నారు
సిద్దార్థ్ శుక్లా
మోడల్‌గా పరిచయమైన సిద్దార్థ్ (sidharth shukla).. 40 ఏళ్లకే మరణించాడు. ఇతడు గుండెపోటుతో చనిపోయాడు! బుల్లితెర సీరియల్ బాలికా వధు (తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు) (balika vadhu cast)తో గుర్తింపు తెచ్చుకున్నారు సిద్దార్థ్. 'ఝలక్ దిఖ్లా జా 6', బిగ్‌బాస్ 13 (bigg boss siddharth shukla)షోలో పాల్గొని మరింత ఫేమ్ సంపాదించారు.
ప్రత్యూష బెనర్జీ
'చిన్నారి పెళ్లి కూతురు' ఫేమ్ ప్రత్యూష బెనర్జీ.. 25ఏళ్లకే ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2016 ఏప్రిల్ 1న ఆమె బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. తమ కుమార్తె మరణానికి కారణం ప్రియుడు రాహుల్ రాజ్ అని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ప్రత్యూషను అతడు మానసికంగా వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్నేహితులు కూడా రాహుల్‌దే తప్పని విచారణలో చెప్పారు.
హీరో సుశాంత్ సింగ్
'ధోనీ' సినిమాతో దేశవ్యాప్తంగా విశేషాదరణ దక్కించుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(sushant singh rajput movies).. 34 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబయిలోని తన నివాసంలో ఉరివేసుకుని సూసైడ్ చేసుకుని అభిమానుల్ని శోకసంద్రంలో ముంచాడు.
జియా ఖాన్
బాలీవుడ్‌లో నటిగా, గాయనిగా గుర్తింపు పొందారు జియా ఖాన్(jiah khan death). ఆమె 'గజిని', 'నిశ్శబ్ద్', 'హౌస్‌ఫుల్' సినిమాల్లో నటించారు. అందం, అభినయంతో అభిమానుల్ని సంపాదించుకున్న ఆమె.. 25 ఏళ్ల వయసులో ముంబయిలోని అపార్ట్‌మెంట్‌లో 2013 జూన్ 3న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మరణానికి ముందు ఆరు పేజీల సూసైడ్ నోట్ రాశారు.
దివ్యభారతి- హీరోయిన్
తెలుగులో 'బొబ్బిలిరాజా' సినిమాతో గుర్తింపు పొందిన హీరోయిన్ దివ్యభారతి.. కేవలం 19 ఏళ్ల వయసులోనే ఆకస్మికంగా మృతి చెందింది. అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది ఈమె మరణం.
సిల్మ్ స్మిత- నటి
ప్రత్యేక గీతాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి సిల్మ్ స్మిత.. 36 ఏళ్ల వయసులోనే కన్నుమూసింది. ఈమె ఆత్మహత్య చేసుకోవడం అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది. ఈ నటి జీవితం ఆధారం 'డర్టీ పిక్టర్' అనే సినిమా వచ్చింది.