తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సోషల్​ వాచ్​: 'నారప్ప' పయనం.. రాధిక సందేశం

సెలబ్రిటీలు తమకు సంబంధించిన కొత్త విశేషాలను తాజాగా సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ప్రస్తుతం అవి నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. అవేంటో మీరూ చూసేయండి.

celebrities social media round up
సోషల్​ వాచ్​: 'నారప్ప' పయనం.. రాధిక సందేశం

By

Published : Nov 6, 2020, 9:28 PM IST

కరోనా కారణంగా ఆగిపోయిన 'నారప్ప' షూటింగ్​ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. దీనికి సంబంధించిన వీడియోను ఆ చిత్రబృందం తాజాగా నెట్టింట పంచుకుంది. మరోవైపు వివాహ ముహూర్తం సమయంలో కాజల్​ కంటతడి పెట్టుకోగా.. నటి రాధికా శరత్​ కుమార్​ తన భర్తతో కలిసి సమయాన్ని గడుపుతున్న ఫొటోలను షేర్​ చేశారు.

  • విక్టరీ వెంకటేశ్​ నటిస్తున్న 'నారప్ప' సినిమా షూటింగ్‌ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో ముందుస్తు జాగ్రత్తల నడుమ చిత్రీకరణ జరుగుతోందని తెలుపుతూ చిత్రబృందం వీడియో షేర్‌ చేసింది. 'నారప్ప' గెటప్‌లో సిద్ధమైన వెంకీ వ్యాన్‌ నుంచి లొకేషన్‌ స్పాట్‌కు వెళుతూ కనిపించారు.
  • నటి రాధిక తన కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతున్నారు. ఇంటి ముందు భర్త శరత్‌కుమార్‌తో కలిసి కూర్చుని తీసుకున్న ఫొటోను షేర్‌ చేశారు. 'ప్రతి రోజూ ఓ కొత్త ప్రారంభం. సుదీర్ఘంగా శ్వాస తీసుకోండి, చిరునవ్వుతో రోజును మొదలుపెట్టండి..' అని సందేశం ఇచ్చారు.
  • కాజల్‌ పెళ్లి తర్వాత ఆమె ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ముహూర్త గడియల్లో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఆమె కంటతడి పెట్టుకున్న ఫొటో తాజాగా వైరల్‌గా మారింది.
  • చిరంజీవి అల్లుడు, కథానాయకుడు కల్యాణ్‌దేవ్‌ తన సతీమణి శ్రీజతో కలిసి మాల్దీవుల్లో సమయం గడుపుతున్నారు. ఈ క్రమంలో అక్కడ తీసిన ఫొటోలు, వీడియోల్ని షేర్‌ చేశారు.
  • శ్రీదేవి రెండో కుమార్తె ఖుషి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా జాన్వి ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. 'ఈరోజు నీ జన్మదినం.. ఈరోజైనా నీతో గొడవపడకుండా ఉండటానికి ప్రయత్నిస్తా' అంటూ సరదాగా పోస్ట్‌ చేశారు.
    కాజల్​ భావోద్వేగం

ABOUT THE AUTHOR

...view details