తెలంగాణ

telangana

By

Published : Jul 27, 2020, 9:20 AM IST

ETV Bharat / sitara

సినీ తారల సోషల్​ మీడియా కబుర్లు ఇవే!

కరోనా కారణంగా లభించిన విరామంతో సినీ తారలు సామాజిక మాధ్యమాల్లో చరుగ్గా ఉంటున్నారు. తాజాగా కొంత మంది నటీనటులు అభిమానులతో పంచుకున్న ఆసక్తికర పోస్టులపై ఓ లుక్కేద్దాం రండి.

celebrities social media posts recently due to lockdown
నెట్టింట్లో వెండితెర తారల సందడి

లాక్​డౌన్​తో దొరికిన తీరిక సమయాల్లో అభిమానులతో మనసు విప్పి మాట్లాడుతున్నారు మన వెండితెర తారలు. తాజాగా, తనపై అభిమానులు చూపిస్తున్న ప్రేమ, ఆదరాభిమానాలకు అక్కినేని కోడలు సమంత కృతజ్ఞతలు తెలిపింది. తన ఇన్‌స్టా ఫాలోవర్లు 11 మిలియన్లు చేరిన సందర్భంగా ప్రత్యేక వీడియోను షేర్‌ చేసింది. అంతే కాదు, తన ఇంటి మేడపైన పండించిన కీరదోశను కోస్తూ ఆ వీడియోను అభిమానులతో పంచుకుంది. మరోవైపు నాగచైతన్య యోగా చేస్తూ శీర్షాసనమేసిన ఫొటోను పోస్ట్ చేశాడు.

ఇక మెగా డాటర్‌ నిహారిక తనకు కాబోయే భర్త చైతన్య పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. పేరెంట్స్‌ డే సందర్భంగా మంచు మనోజ్‌ తన తల్లిదండ్రుల ఫొటోను పంచుకోగా.. అమీ జాక్సన్‌ తన అందాలతో నెటిజన్లను అలరించింది. ఇక కమెడియన్‌ భద్రం తనదైన శైలిలో నవ్వులు పంచాడు. కనికాకపూర్‌ విసిరిన మేకప్‌ ఛాలెంజ్‌ను ఉపాసన స్వీకరించింది. ఇంకా ఎవరెవరు ఏయే పోస్ట్‌లు చేశారో చూసేద్దామా!

ABOUT THE AUTHOR

...view details