బాలనటుడిగా ఒదిగిపోయి.. హీరోయిజానికి నిలువెత్తు నిదర్శనంగా ఎదిగి ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు అగ్రకథానాయకుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. నటనపట్ల తనకున్న అమితమైన ప్రేమ, అంకితభావంతో ఎందరో యువ నటులకు స్ఫూర్తిగా మారారు. బుధవారం ఎన్టీఆర్ పుట్టినరోజు పురస్కరించుకుని అభిమానులతోపాటు పలువురు సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో ఎన్టీఆర్‌కు సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి.
తారక రాముడికి నెట్టింట శుభాకాంక్షల వెల్లువ - ఎన్టీఆర్ లేటెస్ట్ విషెస్
యంగ్‌టైగర్ ఎన్టీఆర్.. డ్యాన్స్‌లోనూ, నటనలోనూ తనకు ఎవరూ సాటి లేరని నిరూపించుకుంటున్నారు. ఎంతోమంది అభిమానుల మనసు దోచుకుంటూ అలరిస్తున్నారు. నేడు ఈ హీరో పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.
సోషల్‌మీడియాలో తారక రాముడికి బర్త్‌డే విషెస్
ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన గేమ్ షో 'బిగ్‌బాస్ సీజన్ 1'. ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సీజన్లో పాల్గొన్న కంటిస్టెంట్స్ అందరూ కలిసి ఓ ప్రత్యేక వీడియో రూపొందించారు. ఎన్టీఆర్‌తో తమకున్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు. ఇదిలా ఉండగా దేవిశ్రీ ప్రసాద్ కూడా తారక్‌కు స్పెషల్ సాంగ్‌తో బర్త్‌డే సర్‌ప్రైజ్ ఇచ్చారు.
ఇదీ చూడండి.. నూనూగు మీసాలోడు.. బాక్సాఫీసును కొల్లగొట్టేశాడు