కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమయ్యారు పలువురు సినీ ప్రముఖులు. ప్రస్తుతం వారికిష్టమైన వ్యాపకాల్లో మునిగితేలుతున్నారు. ఈ జాబితాలో నటి, ఎమ్మెల్యే రోజా, యాంకర్ ప్రదీప్, నటుడు ప్రకాశ్‌రాజ్, హీరోయిన్లు పాయల్ రాజ్‌పుత్, ప్రణీత, అంజలి, రుహనీ శర్మ తదితరులు ఉన్నారు.
సినీనటి, ఎమ్మెల్యే రోజా... తన పిల్లల కోసం చికెన్ వండుతూ కాలక్షేపం చేస్తున్నారు. టీవీ వ్యాఖ్యత, నటుడు ప్రదీప్ మాచిరాజు.. బెండకాయ వేపుడు ఎలా చేయాలో నేర్చుకుంటున్నాడు. సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ తన వ్యవసాయ క్షేత్రంలో కుమారుడికి జాతీయ గీతాన్ని నేర్పిస్తూ సేదతీరుతున్నాడు.