తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాలు కోలుకోవాలని ప్రార్థిస్తూ ప్రముఖుల ట్వీట్లు - ఎస్పీ బాలు

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని అనేకమంది ప్రార్థిస్తున్నారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటూ పలువురు సినీప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు.

Celebrities prays for SP Bala Subrahmanyam's speedy recovery
బాలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న సినీప్రముఖులు

By

Published : Sep 25, 2020, 9:06 AM IST

ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం త్వరగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగి రావాలని సినీప్రముఖులు కోరుకుంటున్నారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న బాలు ప్రస్తుతం ఊపిరితిత్తుల సంబంధిత సమస్యతో ఇబ్బందిపడుతున్నారని, తాజాగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని గురువారం ఎంజీఎం వైద్యులు వెల్లడించారు. దీంతో ఎస్పీబీ కోలుకోవాలని ప్రతిఒక్కరూ ప్రార్థిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సల్మాన్‌ ట్విట్టర్ వేదికగా బాలు ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.

"బాలసుబ్రహ్మణ్యం సర్‌. త్వరగా మీరు కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దేవుడ్ని ప్రార్థిస్తున్నా. నా సినిమాల్లో ఎన్నో పాటలు పాడినందుకు ధన్యవాదాలు. మీ దిల్‌ దివానా హీరో ప్రేమ్‌. లవ్‌ యూ సర్‌."

- సల్మాన్​ ఖాన్​, బాలీవుడ్​ అగ్రకథానాయకుడు

సంగీత దర్శకుడు తమన్‌ కూడా బాలు ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈమేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఓ స్పెషల్‌ వీడియోను పోస్ట్‌ చేశారు.

"లాక్‌డౌన్‌కు ముందు మార్చి నెలలో నాకెంతో ప్రియమైన మామతో(ఎస్పీబీ) మేమంతా సరదాగా గడిపాం. ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు. మామా దయచేసి త్వరగా కోలుకోండి. ఆయన ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థించండి."

- ఎస్​.ఎస్​. తమన్​, సంగీత దర్శకుడు

ABOUT THE AUTHOR

...view details