ఎస్పీ బాలు మృతిపై సినీప్రముఖుల సంతాపం - sp balasubrahmanyam
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(74) తుదిశ్వాస విడిచారు. తీవ్ర అనారోగ్యంతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. బాలు మృతిపై పలువురు సినీ ప్రముఖులు సోషల్మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.
ఎస్పీ బాలు మృతిపై సినీప్రముఖుల సంతాపం
దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(74) కన్నుమూశారు. కరోనా సోకి, తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన.. చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 1.04గంటలకు తుదిశ్వాస విడిచారు. బాలు మృతిపై సోషల్మీడియాలో స్పందించిన పలువురు సినీప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు.