తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పెంపుడు జంతువులపై ఇంకొంచెం ప్యార్‌ కరోనా! - celebrities latest news

పెంపుడు జంతువులను ప్రాణంగా చూసుకునే సెలబ్రిటీలకు వాటిని పూటకోసారైనా పలకరించందే పాలుపోదు. కొందరైతే వాటిని సెట్స్‌కు తీసుకెళుతుంటారు. బిజీ షెడ్యూల్స్‌తో తమ పప్పీలని ఎంత మిస్‌ అవుతుంటామో తెలుసా? అంటూ బెంగపడిపోయే తారల్ని చూస్తూనే ఉంటాం. అలాంటి వాళ్లంతా లాక్​డౌన్ వల్ల ఇప్పుడు పెంపుడు జంతువులతోనే కాలక్షేపం చేస్తున్నారు.

celebrities loving their puppies
పెంపుడు జంతువులను ఇంకొంచెం ప్యార్‌ కరోనా!

By

Published : Apr 22, 2020, 9:26 AM IST

కథానాయికల్లో జంతు ప్రేమికులు చాలా మందే. వాళ్లు ఇంట్లోకి అడుగు పెట్టగానే ముద్దు చేయడానికి ఓ పప్పీనో... స్నూపీనో ఉండాల్సిందే! వాటి సాహచర్యంతోనే ఒత్తిడిని దూరం చేసుకుంటామని చాలా మంది చెబుతుంటారు. చిత్రీకరణల కోసం దేశ విదేశాలు చుట్టొస్తుంటారు. అందమైన పెంపుడు జంతువులు ఎక్కడ కనిపించినా సరే, వాటిని ఖరీదు చేసి ఇంటికి తీసుకొస్తుంటారు. ఎక్కడికెళ్లినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తాము మురిపెంగా పెంచుకుంటున్న పెట్స్​ను పూటకోసారైనా పలకరించందే పాలుపోదు. కొందరైతే వాటిని సెట్స్‌కు తీసుకెళుతుంటారు. 'బిజీ షెడ్యూల్స్‌తో మా పప్పీలని ఎంత మిస్‌ అవుతుంటామో తెలుసా?' అంటూ బెంగపడిపోయే తారల్ని చూస్తూనే ఉంటాం. అలాంటి వాళ్లంతా ఇప్పుడు పెంపుడు జంతువులతోనే కాలక్షేపం చేస్తున్నారు. కరోనా ప్రభావంతో వారు ఇళ్లకే పరిమితమయ్యారు. చిత్రీకరణల్లేవు, ప్రయాణాల్లేవు, స్నేహితుల్ని కలవడాల్లేవు. అయినా సరే... మా కాలక్షేపానికి ఏం ఢోకా లేదంటున్నారు హీరోయిన్లు. పెంపుడు జంతువుల్ని ముద్దు చేస్తూ వాటితో కలిసి సరదా సరదాగా గడుపుతున్నారు. వాటితో కలిసి ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు.

పెంపుడు జంతువులను ఇంకొంచెం ప్యార్‌ కరోనా!

చూడ్డానికి సున్నితంగా, సుకుమారంగా కనిపిస్తుంటారు నాయికలు. వారి మనసులు కూడా సున్నితమే. అందుకే మూగ జీవాలపై మరింత ప్రేమను ప్రదర్శిస్తుంటారు. శ్రుతిహాసన్‌ ఎంతో ఇష్టంగా పెంచుకున్న పిల్లి పేరు క్లారా. ఆమె పంచుకునే ఫొటోల్లోనూ, వీడియోల్లోనూ సింహభాగం క్లారాకు సంబంధించినవే ఉంటాయి. ఆమె అభిమానులతోనూ, తోటి నటులతోనూ ఆన్‌లైన్‌లో ముచ్చట్లు పెట్టిన సమయంలోనూ క్లారా సందడి కనిపిస్తుంటుంది. దాంతో మాటలు కలుపుతూ, సంగీతం వినిపిస్తూ గడుపుతోంది శ్రుతి. ‘నా క్లారా నాతోపాటు వ్యాయామం కూడా చేస్తుంద’ని చెబుతోంది శ్రుతి. కీర్తిసురేశ్ పెంచుకుంటున్న కుక్క పేరు నైక్‌. ఆమెతోపాటే సూర్యోదయాల్ని, సూర్యాస్తమయాల్ని ఆస్వాదిస్తుంటుంది నైక్‌. కీర్తి జిమ్‌కు వెళ్లినా, ఇంట్లో ఉన్నా పక్కన నైక్‌ ఉండాల్సిందే. నిధి అగర్వాల్‌.. జంతు ప్రేమికురాలే. ఆమె కుక్క పేరు బూజో. ఇంట్లో ఉంటూ బూజోకు సంబంధించిన కబుర్లనే పంచుకొంటోంది. ఇడ్లీల్ని బాగా ఇష్టపడుతోందని, మేం తింటున్నప్పుడు దానికి పెట్టకపోతే ద్వేషంతో చూస్తుందని ఆమె చెబుతోంది. పాయల్‌ రాజ్‌పుత్‌ ఇంట్లో రెండు చిన్న పప్పీలుంటాయి. వాటితోనే ఆమె కాలక్షేపం. ప్రణీత కుక్క పేరు బ్లూ. ‘నా బ్లూ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తోందంటూ చెబుతోంది ప్రణీత. అంజలి పోలో అనే కుక్క పిల్లను పెంచుకొంటోంది. రామ్‌చరణ్‌, నాగచైతన్య - సమంత, మంచు మనోజ్‌ తదితరులకూ పెంపుడు జంతువులు మంచి కాలక్షేపాన్నిస్తున్నాయి.

పెంపుడు జంతువులను ఇంకొంచెం ప్యార్‌ కరోనా!

అపోహల్ని తిప్పికొడుతూ...

కరోనా వేళ రకరకాల ఊహాగానాలు, అసత్య వార్తలు వస్తున్నాయి. పెంపుడు జంతువులతోనూ కరోనా వ్యాప్తి చెందుతుందనే ప్రచారం సాగింది. అది ఒట్టి అపోహే అని, పెంపుడు జంతువుల్ని దూరం చేసుకోవద్దంటూ సినీ తారలు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి కష్టకాలంలో వాటిని వదిలిపెట్టకుండా ఇంకొంచెం ప్రేమను పంచండంటూ చెబుతున్నారు. మా ఇంట్లో ఇవి ఓ భాగమని, వాటిని తామెంతో ప్రేమిస్తున్నామంటూ పెంపుడు జంతువులతో కలిసున్న ఫోటోల్ని పంచుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details