సూపర్‌స్టార్ మహేశ్ బాబు కూల్ లుక్‌లో ఆకట్టుకున్నారు. క్లీన్‌షేవ్‌లో యువకుడిగా కనిపించి చూపరుల మనసు దోచుకున్నారు. మహేశ్‌కు సంబంధించిన ఓ అన్‌సీన్ పిక్‌ను ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ డబూ రత్నానీ తాజాగా నెట్టింట్లో పోస్ట్ చేశారు.
మహేశ్ అన్‌సీన్ పిక్.. ఒకే ఫ్రేమ్‌లో అల్లు కుటుంబం - అల్లు శిరీష్ పుట్టినరోజు ఫొటో
లాక్డౌన్ కారణంగా సెలిబ్రిటీలు తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. వారికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. తాజాగా నెట్టింట్లో మెరిసిన తారలపై మీరూ ఓ లుక్కేయండి.
![మహేశ్ అన్‌సీన్ పిక్.. ఒకే ఫ్రేమ్‌లో అల్లు కుటుంబం అల్లు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7411309-thumbnail-3x2-rak.jpg)
రకుల్ షేర్ చేసిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆమె ఫొటో చూసిన నెటిజన్లు "రకుల్.. ఫైర్" అని కామెంట్లు చేస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్, నమ్రత, శ్రియ, మంచు మనోజ్ మధుర జ్ఞాపకాలతో మెప్పించారు.
అల్లు శిరీష్ తన పుట్టినరోజును కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటో నెట్టింట సందడి చేస్తోంది. సన్నీ లియోనీ తన భర్తతో కలిసి గార్డెన్‌లోకి అడుగుపెట్టగా.. పూజా హెగ్డే యోగాసనాలతో ఆకట్టుకున్నారు. ఇలా క్వారంటైన్ లైఫ్‌లో ఉన్న సెలబ్రిటీలందరూ సోషల్‌మీడియా వేదికగా నెట్టింట్లో సందడి చేశారు. తాజాగా నెట్టింట్లో మెరిసిన తారలపై మీరూ ఓ లుక్కేయండి..!