Ranveer singh 83 movie: చారిత్రాత్మక ఘట్టాలను తెరకెక్కించడమంటే మామూలు విషయం కాదు. దాని గురించి ఎంతో పరిశోధన చేయాలి. ఎవరి మనోభావాలను నొప్పించకుండా తీయాలి. అలాంటి ప్రయత్నమే చేసి విజయం సాధించారు '83' చిత్ర దర్శకుడు కబీర్ ఖాన్. 1983లో భారత్ క్రికెట్ జట్టు తొలిసారి ప్రపంచకప్ సాధించడం , కెప్టెన్‌గా కపిల్‌దేవ్‌తో పాటు ఇతర క్రికెటర్లు ప్రదర్శించిన ఆటతీరు నేపథ్యంగా వచ్చిన చిత్రం '83'. ఈనెల 24న థియేటర్లలో విడుదలైంది. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ కపిల్‌దేవ్‌గా రణ్‌వీర్ కనిపించారు. అటు ప్రేక్షకుల ప్రశంసలతో పాటు విమర్శకుల మెప్పు పొందుతూ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది.
తాజాగా '83' చిత్రాన్ని వీక్షించిన సూపర్‌స్టార్ రజనీకాంత్ ట్విటర్ వేదికగా ఆ చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు. "వావ్! అద్భుతమైన చిత్రం. కబీర్ ఖాన్, కపిల్ దేవ్, రణ్‌వీర్, జీవాతో పాటు చిత్రబృందానికి కంగ్రాట్స్" అంటూ ట్వీట్‌చేశారు. మరి ఇతర సెలబ్రెటీలు ఆ చిత్రం గురించి ఏమన్నారంటే..
"భారత క్రికెట్ చరిత్రలో అత్యద్భుతమైన క్షణాన్ని ఇంతకంటే మెరుగ్గా ఎవ్వరూ చూపించలేరేమో. 1983లో జరిగిన ప్రపంచ కప్ ఘట్టాలను భావోద్వేగాలతో అద్భుతంగా రూపొందించిన చలనచిత్రం '83'. అందరూ చక్కటి ప్రదర్శనిచ్చారు. కపిల్‌దేవ్‌గా రణ్‌వీర్ డిఫరెంట్ లెవల్‌లో యాక్ట్ చేశాడు. కపిల్‌దేవ్, కబీర్‌ఖాన్‌తో పాటు టీమ్ అందరికి నా అభినందనలు"
- టీమ్ ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ
"భారతదేశ క్రీడా చరిత్రలో ఒక అద్భుత ఘట్టాన్ని '83' చిత్రం అందంగా తెరకెక్కించింది. దర్శకుడు కొత్త తరాలకు 1983ని మళ్లీ పునరుజ్జీవింపచేసేలా చేసినందుకు ధన్యవాదాలు. రణ్‌వీర్! నీ గురించి ప్రత్యేకించి ఏమి చెప్పను.. ఈ చిత్రంలో నీ నటన బాగుంది. ఒక్క ఫ్రేమ్‌లోనూ ఎలాంటి ఒక్క తప్పిదం కూడా లేదు."