సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు విశిష్ఠ గౌరవం దక్కింది. గురువారం ఉదయం ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆయనకు అందజేస్తున్నట్లు కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు రజనీకి శుభాకాంక్షలు తెలియజేశారు.
"విభిన్న పాత్రలతో మెప్పించడం సహా మనోహరమైన వ్యక్తిత్వం శ్రీ రజనీకాంత్ సొంతం. తలైవాకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయనకు నా అభినందనలు".
- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
"నా ప్రియ మిత్రుడు రజనీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు దక్కడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవార్డును పొందేందుకు రజనీ వంద శాతం అర్హుడు".
- కమల్ హాసన్, కథానాయకుడు