తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఇర్ఫాన్​ గొప్ప స్టార్​.. అతడిని ఎవరూ భర్తీ చేయలేరు' - celebrities condolences to irrfan khan

celebrities condolences to irrfan khan death
నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతిపై సెలబ్రిటీల నివాళులు

By

Published : Apr 29, 2020, 12:20 PM IST

Updated : Apr 29, 2020, 3:48 PM IST

14:57 April 29

ఇర్ఫాన్​ను ఎవరూ భర్తీ చేయలేరు: మెగాస్టార్​

ఇర్ఫాన్​ ఇక లేరు అన్న వార్త తీవ్రంగా బాధిస్తుందని అన్నారు మెగాస్టార్​ చిరంజీవి. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన గొప్ప నటుడు ఇర్ఫాన్​ అని ట్వీట్​ చేశారు. 

''ప్రపంచ గుర్తింపు పొందిన మిమ్మల్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఇర్ఫాన్​.. మిమ్మల్ని మేం ఎంతో కోల్పోతున్నాం. మీరు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.''

              - మెగాస్టార్​ చిరంజీవి, టాలీవుడ్​ నటుడు

14:48 April 29

నిష్ణాత కళాకారుడ్ని కోల్పోయాం: చంద్రబాబు

ఇర్ఫాన్​ ఖాన్​ మరణంపై విచారం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. భారత సినీ పరిశ్రమ ఒక నిష్ణాత కళాకారుడిని కోల్పోయిందని ట్వీట్​ చేశారు.  

14:41 April 29

ప్రధాని మోదీ సంఘీభావం..

"ఇర్ఫాన్ ఖాన్​ మృతి దిగ్భ్రాంతి కలిగించింది. విభిన్న భాషల్లో ఆయన చేసిన విలక్షణమైన పాత్రలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి."

    -ప్రధాని మోదీ

14:24 April 29

'అపూర్వ నటుడికి అశ్రు నివాళి'

ఇర్ఫాన్ ఖాన్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ప్రస్తుత కాలంలో ఉన్న అపూర్వనటుల్లో ఇర్ఫాన్ ఒకరని తెలిపారు. ఆయన పోషించిన పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు.

14:13 April 29

'ఉత్తమ నటుడు'

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతికి సంతాపం తెలిపారు తమిళ కథానాయకుడు కమల్​ హాసన్. తాను చూసిన ఉత్తమ నటుల్లో ఇర్ఫాన్ ఖాన్ ఒకరని పేర్కొన్నారు.  

13:45 April 29

బాలీవుడ్​ నటుడు ఇర్ఫాన్​ ఖాన్​ మృతి పట్ల రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. 

ఓ అసాధారణ నటుడిని కోల్పోయామని ట్వీట్​ చేశారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​. ఆయనలో గొప్ప నటుడే కాకుండా.. మంచి క్రికెటర్​ కూడా దాగి ఉన్నాడని అన్నారు.

రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​, మాజీ సీఎం వసుంధర రాజె, దిల్లీ సీఎం కేజ్రీవాల్​ తదితరులు ఇర్ఫాన్​కు సంతాపం ప్రకటించారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అని తెలిపారు.  

ఇతర రాజకీయ నేతలు పీయూష్​ గోయల్​, ఒమర్​ అబ్దుల్లా, స్మృతి ఇరానీ కూడా విచారం వ్యక్తం చేశారు.  

13:40 April 29

''సినిమా ప్రపంచం గొప్ప నటుడ్ని కోల్పోయింది. అతడితో కలిసి పనిచేసే అదృష్టం నాకు లేకుండా పోయింది. కానీ ఆయన నటనను మాత్రం చూశా. అతడు ఓ అద్భుతమైన నటుడు. మీరు పరిశ్రమకు చేసిన సేవ మాకెప్పటికీ గుర్తుండిపోతుంది.''

          - వెంకటేష్, టాలీవుడ్​ నటుడు‌

''దిగ్భ్రాంతికర వార్త. ఇర్ఫాన్‌ ఖాన్‌ మృతి నన్ను తీవ్రంగా బాధిస్తోంది. మా కాలంలోని ఓ గొప్ప నటుడు. ఈ కష్ట సమయంలో అతడి కుటుంబ సభ్యులకు ఆ దేవుడు తట్టుకునే శక్తినివ్వాలని కోరుకుంటున్నా''

       - అక్షయ్‌ కుమార్‌

13:38 April 29

ఇర్ఫాన్​ను చాలా మిస్సవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు ప్రముఖ నిర్మాత బోనీ కపూర్​, నటి ఖుష్బూ. 

''ఓ గొప్ప నటుడిని మనం కోల్పోయాం. ఆయన చివరి వరకూ పోరాడుతూనే ఉన్నాడు. నిన్ను మేం చాలా మిస్‌ అవుతున్నాం. ఆయన కుటుంబసభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నా''

             -బోనీ కపూర్‌

'ముఖాముఖిగా కలవకపోయినా కొందరితో బంధం ఏర్పడుతుంది. మన రోజువారి జీవితంలో వారు ఉన్నట్లు ఉంటుంది. మనతో ప్రయాణిస్తున్నట్లు ఉంటుంది. ఇర్ఫాన్‌ ఖాన్‌ అలాంటి వ్యక్తి. మిమ్మల్ని చాలా మిస్‌ అవుతున్నాం'

          - ఖుష్బూ

13:36 April 29

ఇర్ఫాన్‌ ఖాన్‌ మరణ వార్త విని షాక్‌కి గురైనట్లు పేర్కొన్నారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​.

''మా కాలపు అసాధారణమైన నటుల్లో ఆయన ఒకరు. ఆయన చిత్ర పరిశ్రమకు చేసిన సేవ ఎప్పటికీ మన మనసుల్లో అలానే నిలిచి ఉంటుంది.''

      -కేజ్రీవాల్​, దిల్లీ సీఎం

13:24 April 29

ఇర్ఫాన్​ ఖాన్​ మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందన్న క్రికెట్​ దిగ్గజం సచిన్​ తెందుల్కర్​.. గొప్ప నటుడిని కోల్పోయామని ట్వీట్​ చేశారు. ఇర్ఫాన్​ సహజనటుడని ప్రశంసించారు. 

' నా అభిమాన నటుల్లో ఇర్ఫాన్​ ఒకరు. దాదాపు అతని చిత్రాలన్నీ చూశా. చివరి చిత్రం అంగ్రేజీ మీడియం. అతని ఆత్మకు శాంతి చేకూరాలి. ఇర్ఫాన్​ ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతి.''

              - సచిన్​ తెందుల్కర్​

13:19 April 29

ఇర్ఫాన్​ ఖాన్​ మరణం పట్ల క్రీడాలోకం కూడా నివాళులర్పిస్తోంది. భారత మాజీ క్రీడాకారులు అనిల్​ కుంబ్లే, మహ్మద్​ కైఫ్​.. ఇర్ఫాన్​కు సంతాపం ప్రకటించారు. ప్రతిభావంతుడైన నటుడిని త్వరగా కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు. 

13:14 April 29

ప్రముఖ బాలీవుడ్​ నటుడు ఇర్ఫాన్​ ఖాన్​ మరణ వార్త తనను కలచివేసిందని ట్వీట్​ చేశారు అమితాబ్​ బచ్చన్​. 'అపార ప్రతిభ, మంచి సహనటుడు.. ప్రపంచ సినీరంగానికి ఎంతో కృషి చేసిన ఇర్ఫాన్​ త్వరగా మమ్మల్ని విడిచివెళ్లి శూన్యాన్ని నింపారు' అని ఆవేదన వ్యక్తం చేశారు.  

12:58 April 29

ఇర్ఫాన్​ అకాలమరణం పట్ల విచారం వ్యక్తం చేశారు టాలీవుడ్​ సూపర్​స్టార్​ మహేశ్​ బాబు. ఒక మంచి నటుడు ఇంత త్వరగా తమను విడిచివెళ్లడం బాధ కలిగిస్తోందని ట్వీట్​ చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మహేశ్​ బాబు హీరోగా నటించిన సైనికుడు చిత్రంలో.. విలన్​ పాత్రలో మెప్పించారు ఇర్ఫాన్​ ఖాన్​.   

12:53 April 29

ఇర్ఫాన్​ మృతిపై విచారం వ్యక్తం చేసింది నటి ప్రియాంక చోప్రా. మిమ్మల్ని చూసి ఎందరో స్ఫూర్తి పొందారని, ఎందరికో మార్గనిర్దేశకులుగా నిలిచారని ప్రశంసించారు. ఇర్ఫాన్​ను ఎంతో కోల్పోతున్నామని ట్వీట్​ చేసిన ప్రియాంక.. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

12:48 April 29

ఇర్ఫాన్​ హఠాన్మరణంతో పలువురు ప్రముఖులు తీవ్ర కుంగుబాటుకు లోనయ్యారు. సినీ, రాజకీయ రంగాలకు చెందిన వారందరూ ఇర్ఫాన్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆయనతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. 

ఇర్ఫాన్​ నటించిన ప్రతి పాత్ర తమ జ్ఞాపకాల్లో ఉందని ట్వీట్​ చేశారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. పాన్​ సింగ్​ తోమర్​ నుంచి అంగ్రేజీ మీడియం వరకు అద్భుత పాత్రలు పోషించారని గుర్తుచేసుకున్నారు. 

12:42 April 29

భారత సినీ పరిశ్రమ గర్వించదగిన గొప్ప నటుల్లో ఇర్ఫాన్ ఒకరని ​కొనియాడారు భాజపా నేత జ్యోతిరాధిత్య సింధియా. ఆయన మృతి ఆశ్చర్యానికి గురిచేసిందన్న సింధియా.. ఇర్ఫాన్​ మృతి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. 

12:36 April 29

ఇర్ఫాన్​ మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ప్రముఖ బాలీవుడ్​ నటులు రితీశ్​ దేశ్​ముఖ్​, జాన్​ అబ్రహాం, అర్మాన్​ మాలిక్​. ఓ గొప్ప నటుడిని కోల్పోయామని ట్వీట్​ చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. 

12:35 April 29

అదే చివరిది...

ఇర్ఫాన్​ ఖాన్​ చివరగా అంగ్రేజీ మీడియం అనే సినిమాలో నటించారు. తెలుగులో సైనికుడు చిత్రంలో నటించి మెప్పించారు ఇర్ఫాన్​. 2011లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 

కొన్నేళ్లుగా అరుదైన క్యాన్సర్​తో బాధపడుతున్న ఆయన.. ఇవాళ కన్నుమూశారు. 

12:29 April 29

ఇర్ఫాన్ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన అనుపమ్ ఖేర్

తన స్నేహితుడు, నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతిచెందడం పట్ల విచారం వ్యక్తం చేశారు అనుపమ్​ ఖేర్​. ఇదో విషాదకరమైన రోజుగా అభివర్ణించిన ఆయన.. ఇర్ఫాన్​ ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్​ చేశారు.

12:26 April 29

ఇర్ఫాన్​ మృతిపై సంతాపం వ్యక్తం చేసిన ప్రముఖ నిర్మాత బీఏ రాజు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. 

12:22 April 29

ఓ మంచి కోస్టార్​ను కోల్పోయాం: రవీనా

ఇర్ఫాన్​ మృతిపై స్పందించింది ఒకప్పటి బాలీవుడ్​ నటి రవీనా టాండన్​. ఒక మంచి సహనటుడు, గొప్ప మానవతావాదిని కోల్పోయామని ట్వీట్​ చేసింది. చాలా త్వరగా తమను వదలివెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. 

12:09 April 29

ఇర్ఫాన్ ఖాన్.. రియల్ ఫైటర్: పరిణీతి చోప్రా

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతిపై నటి పరిణీతి చోప్రా విచారం వ్యక్తం చేసింది. అతడితో ఉన్న ప్రతిక్షణం మర్చిపోలేనిదని చెప్పకొచ్చింది. అతడు ఓ రియల్ ఫైటర్​ అని ట్విట్టర్​లో రాసుకొచ్చింది.

Last Updated : Apr 29, 2020, 3:48 PM IST

ABOUT THE AUTHOR

...view details