తెలంగాణ

telangana

ETV Bharat / sitara

''ఆర్‌ఆర్‌ఆర్‌' ఓ మాస్టర్‌ పీస్‌.. భారతదేశ అగ్నిపర్వతం'- సెలబ్రిటీల రివ్యూలు

RRR Movie Review: 'ఆర్​ఆర్​ఆర్'​ చిత్రం ఒక మాస్టర్​​ పీస్​ అంటూ కొనియాడారు హీరో వరుణ్​తేజ్​. భారీ అంచనాల నడుమ శుక్రవారమే ఈ సినిమా విడుదలైంది. వరుణ్​ సహా 'ఆర్​ఆర్​ఆర్​'ను చూసిన అనేక మంది సెలెబ్రటీలు సామాజిక మాధ్యమాల వేదికగా తమ అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు. ఎవరెవరు ఏమంటున్నారో చూసేయండి.

RRR movie review
'ఆర్‌ఆర్‌ఆర్‌' vన

By

Published : Mar 25, 2022, 1:41 PM IST

RRR movie review: సినీ ప్రేక్షకలోకంతోపాటు భారతీయ చిత్ర వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన 'రౌద్రం రణం రుధిరం' శుక్రవారం విడుదలై.. సందడి చేస్తోంది. ఇప్పటికే సినిమా చూసిన కొందరు ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాల్ని పంచుకోగా మరికొందరు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఎవరేమన్నారంటే..

• 'ఆర్‌ఆర్‌ఆర్‌'కు మంచి స్పందన రావటం సంతోషంగా ఉంది. నటులు, సాంకేతిక బృందానికి కంగ్రాట్స్‌. నా కుటుంబంతో కలిసి ఈ చిత్రాన్ని త్వరలోనే చూస్తా. ఈ సినిమా గత రికార్డులను బద్దలుకొట్టాలని ఆశిస్తున్నా. ఆల్‌ ది బెస్ట్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌'. - తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌.

• 'ఆర్‌ఆర్‌ఆర్‌' ఓ మాస్టర్‌ పీస్‌. - నటుడు వరుణ్‌తేజ్‌.

• 'ఆర్‌ఆర్‌ఆర్‌'.. బ్లాక్‌బస్టర్‌. - నటుడు సాయిధరమ్‌ తేజ్‌.

• మైండ్‌ బ్లోయింగ్‌ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. ఎంతో అద్భుతంగా ఉంది. భారతీయ సినిమా గర్వించే దర్శకుడు రాజమౌళికి, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లకు శుభాకాంక్షలు. - దర్శకుడు హరీశ్‌ శంకర్‌.

• 'ఆర్‌ఆర్‌ఆర్' ఎంతో బాగుందని తెలిసింది. టీమ్‌కు నా శుభాకాంక్షలు. - నటుడు శ్రీకాంత్‌.

• 'ఆర్‌ఆర్‌ఆర్‌'.. ఓ దర్శకుడిగా నన్ను గర్వించేలా చేసింది. సినీ రంగంలో అడుగుపెట్టాలనుకునేవారికి స్ఫూర్తిగా నిలిచినందుకు రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లకు ధన్యవాదాలు. - దర్శకుడు వి.ఐ. ఆనంద్.

• 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు. - తమిళ నటుడు శివకార్తికేయన్‌.

• రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లకు నా బెస్ట్‌ విషెస్‌. - మలయాళీ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌.

ఇదీ చదవండి:RRR Movie Review: 'ఆర్​ఆర్​ఆర్​' ఎలా ఉందంటే?

ABOUT THE AUTHOR

...view details