బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ ఫొటోపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. దేశమంతా కరోనా వ్యాప్తితో బాధపడుతుంటే.. తీరికగా ఆమె అందాలు ఆరబోస్తున్న ఫొటోలను షేర్ చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సోషల్‌మీడియాలో తనపై వస్తోన్న ట్రోల్స్‌పై జాన్వీ స్పందించింది.
నెటిజన్లపై హీరోయిన్ జాన్వీ కపూర్ ఆగ్రహం - జాన్వీ కపూర్ మ్యాగ్జైన్ ఫొటోషూట్
'అతిలోకసుందరి' కుమార్తె జాన్వీ కపూర్.. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ ఫొటో నెట్టింట ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దేశంలో కరోనా వ్యాప్తితో ప్రజలు ఇబ్బంది పడుతున్న వేళ అందాల ఆరబోత స్టిల్స్ అవసరమా? అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. వీటిపై జాన్వీ స్పందించి.. ధీటుగా జవాబిచ్చింది.
![నెటిజన్లపై హీరోయిన్ జాన్వీ కపూర్ ఆగ్రహం Cautious Janhvi Kapoor safeguards herself against trolls as she shares latest cover shoot](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11634267-18-11634267-1620104944307.jpg)
ఆ ఫొటో లాక్‌డౌన్‌కు ముందు ఓ మ్యాగ్జైన్ కవర్‌పేజీ కోసం చేసిన ఫొటోషూట్‌కు సంబంధించినదని చెప్పింది. నిజనిజాలు తెలుసుకోకుండా అలా ఎలా మాట్లాడుతారని నెటిజన్లపై ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తనకూ సామాజిక బాధ్యత గురించి తెలుసని వెల్లడించింది. ఆ తర్వాత వివాదంగా మారిన ఫొటోను ఇన్స్టాగ్రామ్ నుంచి జాన్వీ తొలగించింది. కరోనా మహమ్మారి నుంచి దేశం త్వరగా కోలుకోలని ప్రార్థిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం జాన్వీ.. 'గుడ్‌లక్ జెర్రీ' సినిమాతో మరో రెండు చిత్రాల్లో నటిస్తోంది.
ఇదీ చూడండి:సవాల్ పాత్రలకు సొగసరి సిద్ధం!