*బర్నింగ్‌స్టార్ సంపూర్ణేశ్‌బాబు 'క్యాలీఫ్లవర్' సినిమా కొత్త పోస్టర్ వచ్చేసింది. ఇందులో బట్టల్లేకుండా కేవలం క్యాలీఫ్లవర్ మాత్రమే పట్టుకొని ఉన్న సంపూ.. నెటిజన్లను షాక్‌కు గురిచేశాడు. 'శాసనసభ ఎదుట, క్యాలీఫ్లవర్ సాక్షి గా, శీలో రక్షతి రక్షితః' అంటూ ఫొటోకు క్యాప్షన్‌తో పోస్ట్ చేశారు.
*క్రికెటర్ హర్భజన్ నటిస్తున్న 'ఫ్రెండ్షిప్' సినిమాలోని పాట రిలీజైంది. 'అరిచి అరగదీయమ్మా' అంటూ సాగుతున్న గీతం.. చిత్రంపై అంచనాల్ని పెంచుతోంది. తెలుగు, తమిళ భాషల్లో తీస్తున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.