కుటుంబంలో(cash program latest) ఉన్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటి షకీలా. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆమె ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో నటిస్తున్నారు(cash latest episode promo). తాజాగా ఆమె సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న 'క్యాష్' గేమ్ షోలో సందడి చేశారు. జ్యోతి, సంపూర్ణేశ్ బాబు, అభినయశ్రీలతో కలిసి సరదాగా గేమ్‌లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా షకీలా తన గతాన్ని గుర్తు చేసుకున్నారు. తనకు ఎవరూ లేరని తలచుకుంటే బాధతో కన్నీళ్లు వస్తున్నాయంటూ బాధపడ్డారు.
'నన్ను అలా చూసి నాన్నకు హర్ట్‌ఎటాక్ వచ్చింది' - cash latest episode promo
ఓ సన్నివేశంలో(Shakeela upcoming movies) తాను నటించడం చూసి తన తండ్రికి గుండెపోటు వచ్చిందని భావోద్వేగానికి గురయ్యారు నటి షకీలా. దీంతో పాటే తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను గుర్తుచేసుకుని కన్నీరు పెట్టుకున్నారు.
తన తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ(shakeela upcoming movie).. "మా నాన్నకు నేనంటే ఎంతో ఇష్టం. చిన్నప్పుడు నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమయంలో నటిగా రాణించడం కోసం నేను ఎంతలా కష్టపడ్డానో మా నాన్నకు బాగా తెలుసు. నా కష్టాలను ఆయన దగ్గరుండి చూశారు. ఓ సినిమా షూట్‌కు నాన్న నాతోపాటు సెట్‌కు వచ్చారు. షాట్‌లో భాగంగా నేను భవనంపై నుంచి కిందకు దూకాలి. డూపు లేకుండా నేనే దూకాల్సి వచ్చింది. అప్పుడు నా కాలు కూడా విరిగింది. అది చూసి మా నాన్నకు గుండెపోటు వచ్చింది. ఇకపై సినిమాల కోసం అలాంటి యాక్షన్ తరహా సన్నివేశాలు చేయవద్దని నాన్న చెప్పారు" అంటూ షకీలా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ షోలోనే జ్యోతి, సంపూర్ణేశ్ బాబు, షకీలాలు వరుస పంచులతో సరదాగా నవ్వులు పూయించారు. వచ్చే శనివారం ప్రసారం కానున్న 'క్యాష్' ప్రోగ్రామ్ ప్రోమో చూసేయండి..!
ఇదీ చూడండి: 'సర్కారు వారి పాట' వీడియో లీక్.. మహేశ్ లుక్ అదిరింది!