సుశాంత్ ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. మరో నలుగురు సినీ ప్రముఖులపై కేసు నమోదు చేశారు న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా. మహేశ్ భట్, ముఖేశ్ భట్, రియా చక్రవర్తి, కృతీ సనన్‌లపై ముజఫర్‌పుర్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఇటీవలే సల్మాన్ ఖాన్, సంజయ్ లీలా భన్సాలీ, కరణ్ జోహర్‌లతో పాటు మొత్తం ఎనిమిది మందిపై కేసు పెట్టారు ఓజా.
సుశాంత్ సూసైడ్: మరో నలుగురిపై కేసు - సుశాంత్ సింగ్ సూసైడ్ కేసు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. మరో నలుగురు సినీ ప్రముఖులపై న్యాయవాది సుధీర్ ఓజా కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు సల్మాన్‌ఖాన్, సంజయ్ లీలా భన్సాలీ, కరణ్ జోహర్ సహా మొత్తం ఎనిమిది మందిపై కేసు పెట్టారు.
సుశాంత్ సూసైడ్: మరో నలుగురు సీనీ ప్రముఖులపై కేసు నమోదు
కొందరు ప్రముఖులు సుశాంత్‌కు సినిమా ఆఫర్లు రాకుండా చేశారని.. ఎన్నో చిత్రాల నుంచి ఆతడిని తొలగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు సుధీర్. అందువల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు.
ఇదీ చూడండి:సుశాంత్ సూసైడ్: సల్మాన్, కరణ్, భన్సాలీపై కేసు నమోదు