బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై పెద్ద దుమారమే రేగుతోంది. సుశాంత్ సూసైడ్ చేసుకోవడానికి కొందరు ప్రముఖులు కారణమంటూ సామాజిక మాధ్యమాల్లో తెగ చర్చ నడుస్తోంది. దీనిపై స్పందించిన బిహార్‌కు చెందిన సుధీర్ కుమార్ ఓజా అనే న్యాయవాది ఓ కేసును కూడా నమోదు చేశారు.
సుశాంత్ సూసైడ్: సల్మాన్, కరణ్, భన్సాలీపై కేసు నమోదు - సుశాంత్ సూసైడ్
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడానికి కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్, సంజయ్ లీలా భన్సాలీ, ఏక్తా కపూర్లు కారణమన్నారు బిహార్ న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా. వీరందరిపై కేసు కూడా నమోదు చేశారు.
![సుశాంత్ సూసైడ్: సల్మాన్, కరణ్, భన్సాలీపై కేసు నమోదు Case file on Salman Khan, Karana Johar, Ekta Kapoor, Sanjay Leela Bhansali over Sushanth suicide](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7650528-thumbnail-3x2-kar.jpg)
సల్మాన్
బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, హీరో సల్మాన్ ఖాన్, నిర్మాత ఏక్తా కపూర్‌లపై ఐపీసీ సెక్షన్ 306, 109, 504, 506 కింద ముజఫర్‌పుర్‌లో కేసు నమోదు చేసినట్లు సుధీర్ కుమార్ తెలిపారు.
"కొందరు ప్రముఖులు కలిసి సుశాంత్‌కు సినిమా ఆఫర్లు రాకుండా చేశారు. కొన్ని చిత్రాల విడుదల కూడా ఆగిపోయింది. ఏడు సినిమాల నుంచి అతడిని తొలగించారు. అందువల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు" అంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు న్యాయవాది సుధీర్.