తెలంగాణ

telangana

ETV Bharat / sitara

క్యాంటీన్​లో కామ్రేడ్ గ్యాంగ్​ అల్లరి - రష్మిక మందన్న

'డియర్ కామ్రేడ్' సినిమాలో కాలేజ్ క్యాంటీన్​ అంటూ సాగే గీతాన్ని విడుదల చేసింది చిత్రబృందం. విజయ్ దేవరకొండ, రష్మిక మరోసారి జంటగా అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

క్యాంటీన్​లో కామ్రేడ్ గ్యాంగ్​ అల్లరి

By

Published : Jun 30, 2019, 2:16 PM IST

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందణ్న జంటగా నటిస్తున్న చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’. ఇందులోని 'కాలేజీ క్యాంటీను అంటేనే ప్రేమ పక్షులకు హెవెను' అంటూ సాగే గీతాన్ని విడుదల చేసింది చిత్రబృందం. జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించాడు.

కథానాయకుడు విజయ్‌.. తన గ్యాంగ్​తో ఫుల్‌ జోష్‌గా స్టెప్పులేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ‘శివ’ సినిమాలోని బోటనీ పాఠముంది పాటను గుర్తుకు తెచ్చేలా ఉంది.

భరత్​ కమ్మ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ అంచనాల్ని పెంచేసింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం జులై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: తెలంగాణ పిల్లగాడిగా అక్కినేని హీరో నాగచైతన్య..!

ABOUT THE AUTHOR

...view details