ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న కరోనా వైరస్(కొవిడ్-19) చలనచిత్ర పరిశ్రమనూ కుదిపేస్తోంది. కరోనా దెబ్బకి ఇప్పటికే కొన్ని సినిమాల షూటింగ్‌లు, మరికొన్ని చిత్రాల ప్రచార కార్యక్రమాలు నిలిచిపోయాయి. తాజాగా అతిపెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ 'కేన్స్' కూడా రద్దయ్యే అవకాశాలున్నాయి. ఏటా ఫ్రాన్స్‌లో నిర్వహించే ఈ వేడుకను కరోనా కారణంగా రద్దు చేయాలనుకుంటున్నట్లు ఆ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రెసిడెంట్ పెర్రీ లెస్క్యూర్ ప్రకటించినట్లు సమాచారం.
"కరోనా తీవ్రత మార్చి చివరి నాటికి కొంతవరకు తగ్గుముఖం పట్టొచ్చు. ఏప్రిల్ నెల నుంచి కొంత ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నాం. ఒకవేళ పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. ఈ ఏడాది కేన్స్‌ను రద్దు చేస్తాం"