కరోనా కారణంగా గతేడాది జరగాల్సిన పలు ప్రముఖ ఫిల్మ్ ఫెస్టివల్స్ వాయిదా పడ్డాయి. కొన్నింటిని వర్చువల్‌గా నిర్వహించారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా జరగలేదు. దీంతో ఈ ఏడేదైనా సవ్యంగా వేడుక జరుగుతుందని అంతా భావించారు. కానీ ఈ ఏడాది కూడా కేన్స్‌ను వాయిదా వేశారు నిర్వాహకులు. మే 11 నుంచి 22 వరకు జరగాల్సిన ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌ను జులై 6 నుంచి 17 వరకు నిర్వహించనున్నారు.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్-2021 వాయిదా - 74వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్
కరోనా కారణంగా గతేడాది రద్దయిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్.. ఈ ఏడాది కూడా వాయిదా పడింది. మేలో జరగాల్సిన ఈ వేడుకను జులైకి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు నిర్వాహకులు.
"ఫ్రాన్స్‌తో పాటు అంతర్జాతీయంగా ప్రస్తుత పరిస్థితి కుదుటపడ్డాక ఈ వేడుకను నిర్వహిస్తాం. ప్రస్తుతం ఈ విషయమై ఫ్రెంచ్ ప్రభుత్వం, చిత్రపరిశ్రమ ప్రముఖులు, ఇతర అధికారులతో చర్చలు జరుపుతున్నాం." -కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులు.
'కేన్స్' వేడుకల్లో ఎర్రతివాచీపై అందాల భామలు అలా నడిచి వెళ్తుంటే.. వారి హొయలు తిలకించేందుకు భారీగా అభిమానులు తరలివస్తారు. ఏటా జరిగే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం అటు తారలతోపాటు ఇటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.