బెంగాలీ నటి, పార్లమెంటు సభ్యురాలు మిమీ చక్రవర్తి లైంగిక వేధింపులకు గురయ్యారు. తన కారులో ప్రయాణిస్తుండగా, నడిరోడ్డుపై ఓ ట్యాక్సీ డ్రైవర్ ఈమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం కోల్‌కతాలో జరిగింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సదరు డ్రైవర్‌ను అరెస్టు చేశారు.
సోమవారం సాయంత్రం మిమీ చక్రవర్తి కోల్‌కతాలోని గరియాహాట్లోని జిమ్ నుంచి బాలిగంజ్ పారి వైపు తిరిగి వెళ్తున్నారు. ఆ సమయంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ టాక్సీడ్రైవర్ ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురిచేశాడు. టాక్సీ నెంబర్ ఆధారంగా మిమీ చక్రవర్తి గరియా హాట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే రంగంలోకి దిగి నిందితుడిని పట్టుకున్నారు. లైంగిక వేధింపుల నిరోధక చట్టం కింద అతడిపై కేసు నమోదు చేశారు.