'కేరాఫ్ కంచరపాలెం', 'ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య' చిత్రాలకు కలిసి పని చేశారు వెంకటేశ్ మహా, పరుచూరి ప్రవీణ. ఈ రెండు సినిమాలకు వెంకటేశ్ దర్శకత్వం వహించాడు. కాగా వీరి నుంచి మరో చిత్రాన్ని తాజాగా ప్రకటించారు. వీరి పరిచయానికి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు దర్శకుడు వెంకటేశ్ మహా.
'కంచరపాలెం' టీమ్ నుంచి మరో విభిన్న చిత్రం - వెంకటేశ్ మాహా కొత్త చిత్రం
'కేరాఫ్ కంచరపాలెం', 'ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య' చిత్రాలతో అలరించిన దర్శకుడు వెంకటేశ్ మహా. తాజాగా ఇతడి నుంచి మూడో సినిమా రాబోతుంది. దానికి సంబంధించిన టైటిల్ లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
'కంచరపాలెం' టీమ్ నుంచి మరో విభిన్న చిత్రం
'సు మతి' అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'యాన్ ఎంపైర్ స్టేట్ ఆఫ్ మైండ్' అనేది ఉపశీర్షిక. తాజాగా దీనికి సంబంధించిన యానిమేటెడ్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఓ ముసలావిడ అమెరికాలోని ప్రసిద్ధ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ముందు నిలబడి దాని వైపు తదేకంగా చూస్తూ ఉంది. దీన్ని బట్టి చూస్తుంటే దర్శకుడు మహా మరోసారి విభిన్న కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.