తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడిగా సి.కళ్యాణ్ గెలుపొందారు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే నిర్మాతల మండలి ఎన్నికల్లో నాలుగు సెక్టార్ల నుంచి అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఒక్కోసారి ఒక్కో సెక్టార్ నుంచి అధ్యక్షుడిని ఎంపిక చేస్తారు.
తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడిగా సి. కల్యాణ్ - tollywood
తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడిగా సి.కళ్యాణ్ గెలుపొందారు. ప్రత్యర్థి ప్రతాని రామకృష్ణగౌడ్ పై 378 ఓట్లతో విజయం సాధించారు.
![తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడిగా సి. కల్యాణ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3706635-thumbnail-3x2-kalyan.jpg)
ఈ దఫా నిర్మాతల సెక్టార్ నుంచి అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగగా బరిలో దిగిన సి.కళ్యాణ్.. ప్రత్యర్థి పతాని రామకృష్ణగౌడ్ పై 378 ఓట్లతో గెలుపొంది నిర్మాతల మండలి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. మొత్తం 477 ఓట్లున్న నిర్మాతల మండలిలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతోపాటు ఎస్వీ క్రిష్ణారెడ్డి, పోసాని కృష్ణమురళి, పలువురు నిర్మాతలు, పంపిణీదారులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలైన ఓట్లలో అత్యధికంగా 378 ఓట్లు సి.కళ్యాణ్‌కు రాగా... రామకృష్ణగౌడ్ 75 ఓట్లు సాధించి ఓడిపోయారు.
ఇవీ చూడండి.. క్యాంటీన్లో కామ్రేడ్ గ్యాంగ్ అల్లరి