స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' చిత్రంలోని'బుట్ట బొమ్మ' పాట టీజర్ విడుదలైంది. లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. అర్మాన్ మాలిక్ ఈ గీతాన్ని పాడాడు. పూర్తి సాంగ్ ఈనెల 24న రానుంది.
ఈ సినిమాలో నుంచి ఇప్పటికే వచ్చిన 'రాములో రాములా', 'సామజవరగమన' పాటలు.. చెరో 100 మిలియన్ల వీక్షణలు సాధించడం విశేషం. మరి 'బుట్టబొమ్మ' ఇంకెన్ని రికార్డులు అందుకుంటోందో చూడాలి.