ఆది సాయికుమార్, మిస్తి చక్రవర్తి ప్రధానపాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'బుర్రకథ'. డైమండ్ రత్నబాబు దర్శకుడు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది.
రామ్, అభి అనే రెండు పాత్రల్లో కనిపించనున్నాడు ఆది. అభి తుంటరి కుర్రాడిగా, రామ్ పద్ధతిగా భారతీయ సంప్రదాయాలకు విలువిచ్చే వ్యక్తిగా అలరించనున్నాడు. టీజర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. రాజేంద్ర ప్రసాద్, పోసాని కీలక పాత్రల్లో నటించారు.