డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ఆది హీరోగా తెరకెక్కిన చిత్రం 'బుర్రకథ'. రెండు మెదళ్లతో పుట్టిన హీరో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. మొదట ఈ సినిమాను జూన్ 28న విడుదల చేయాలనుకున్నారు. సెన్సార్ కార్యక్రమాల ఆలస్యం కారణంగా విడుదల తేదీ ఒకరోజు ఆలస్యంగా జూన్ 29న విడుదల చేయబోతున్నామని చిత్ర బృందం తెలిపింది.
జూన్ 29న బుర్రకథ విడుదలయ్యేనా..? - cinema
ఆది సాయికుమార్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'బుర్రకథ'. ఈ సినిమాను జూన్ 29న విడుదల చేస్తామని తెలిపినా.. కొన్ని కారణాల వల్ల మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

బుర్రకథ
తాజా సమాచారం ప్రకారం జూన్ 29న కూడా సినిమా విడుదల కావడం సాధ్యం కాదని తెలుస్తోంది. చిత్రబృందం మాత్రం విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చెబుతున్నారు.
ఈ చిత్రాన్ని దీపాల ఆర్ట్స్ బ్యానర్‌పై హెచ్.కె. శ్రీకాంత్ దీపాల నిర్మిస్తున్నాడు. పక్కా కామెడీ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాలో ఆది సరసన మిస్తీ చక్రవర్తి , నైరాషా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు.