తెలంగాణ

telangana

By

Published : Jun 20, 2020, 5:31 AM IST

Updated : Jun 20, 2020, 6:40 AM IST

ETV Bharat / sitara

ఆగస్టులో సెట్స్​పైకి 'బంటీ ఔర్ బబ్లీ 2'

కరోనా వల్ల నిలిచిపోయిన 'బంటీ ఔర్ బబ్లీ 2' షూటింగ్​ను ఆగస్టులో తిరిగి ప్రారంభించాలని చిత్రబృందం భావిస్తోంది. తొలుత ఓ పాటను తెరకెక్కించాలని భావిస్తోంది.

ఆగస్టులో సెట్స్​పైకి 'బంటీ ఔర్ బబ్లీ 2'
బంటీ ఔర్ బబ్లీ 2'

'బంటీ ఔర్ బబ్లీ' సినిమాకు కొనసాగింపుగా బాలీవుడ్​లో ఓ సినిమా తీస్తున్నారు. ఇప్పటికే కొంత భాగాన్ని చిత్రీకరించారు. దీనిని తిరిగి ఆగస్టులో మొదలుపెట్టాలని భావిస్తున్నారు. వరుణ్‌ వి.శర్మ దర్శకత్వం వహిస్తుండగా, ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

'బంటీ ఔర్ బబ్లీ 2' చిత్ర నటీనటులు

కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా షూటింగ్‌ను మొదలుపెట్టి, ముందుగా ఓ పాటను కొద్దిమందితోనే పూర్తిచేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాలో సైఫ్‌ అలీఖాన్‌ సీనియర్‌ బంటీగా, రాణీ ముఖర్జీ బబ్లీ సీనియర్‌గా నటిస్తున్నారు. సిద్ధాంత్‌, శార్వారి వాగ్‌లు బబ్లీ జూనియర్స్ పాత్రల్లో కనిపించనున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది జూన్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కరోనా ప్రభావంతో చిత్రీకరణ పూర్తవక అది కాస్త ఆలస్యమైంది.

Last Updated : Jun 20, 2020, 6:40 AM IST

ABOUT THE AUTHOR

...view details