తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బన్నీ మాటల్లో ... 'సామజవరగమన' విశేషాలు!

ఓ 30 ఏళ్ల యువకుడు.. 60 ఏళ్ల వృద్ధుడు కలిసి తీసిన ఓ కూని రాగం కోట్ల మంది మనసుల్ని మీటింది. లక్షలాది గొంతుకుల నుంచి తిరిగి మారు మోగింది. ఆ అద్భుత గీతమే "సామజవరగమన". ఈ పాట ఎలా పుట్టిందనే విషయంపై ఓ ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చారు స్టైలిష్ స్టార్ బన్నీ.

samajavaragamana
బన్నీ మాటల్లో ... 'సామజవరగమన' విశేషాలు!

By

Published : Dec 5, 2020, 4:15 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో'లోని 'సామజవరగమన' పాట ఒక సెన్సేషన్​గా మారిన సంగతి తెలిసిందే. అయితే "ఈ పాటను రాసింది అరవై ఏళ్ల సీతారామ శాస్త్రి, దానికి సంగీతం అందించింది ముప్పై ఏళ్ల యువతరం తమన్​" అని 2019 సాంగ్​ ఆఫ్​ ది ఇయర్​గా గుర్తింపు పొందిన 'సామజవరగమన' గురించి మాట్లాడారు దర్శకుడు త్రివిక్రమ్.

మరి ఇంతలా సినీ సంగీత ప్రియుల మదికి చేరువైన ఈ 'సామజవరగమన' గీతం పుట్టుక వెనుక ఓ పెద్ద కథే నడిచిందట. తాజాగా ఈ విషయాన్ని అల్లు అర్జున్‌ తన ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

అలవైకుంఠపురంలో

బన్నీ మాటల్లో..

"ఈ పాటకు ఓ చిన్న హిస్టరీ ఉంది. నేను ఖాళీగా ఉన్న రోజుల్లో.. అంటే గత రెండేళ్లలో బ్యాండ్‌ కల్చర్‌ బాగా పెరిగింది. ఇలాంటి వేడుకలకి నా భార్య చాలాసార్లు పిలిచేది. ఇన్ని సార్లు అడుగుతుంది కదా అని.. ఓసారి తనతో పాటే వెళ్లా. ఆ బ్యాండ్‌కు అందరి నుంచి.. ముఖ్యంగా యువతరం నుంచి మంచి స్పందన లభించింది. అప్పుడే అనుకున్నా.. ఇలా ప్రతి ఒక్కరూ పాడుకునేలా ఓ చక్కటి గీతం నా సినిమాలో ఉండాలని నిర్ణయించుకున్నా. అప్పుడు అనుకోకుండా.. ఈ చిత్రంలో ఓ సీన్‌కు లవ్‌ సాంగ్‌ పడాల్సిన సమయం వచ్చినప్పుడు తమన్‌ కూడా బ్యాండ్‌ కల్చర్‌ గురించి చెప్పాడు.

"ప్రస్తుతం యూత్‌ ఎలాంటి గీతాల్నైతే ఇష్టపడుతున్నారో అలాంటి టెంపోలో మనమూ ఓ పాట చేద్దామని చెప్పా. అలా త్రివిక్రమ్‌ సరదాగా 'సామజవరగమన' అనే ఓ కూని రాగం తీశారు. దానికి అప్పటికి మిగతా సాహిత్యమేం రాయలేదు. తర్వాత అది నాకు, తమన్‌కి కూడా నచ్చడం వల్ల 'ఇది చేసేద్దాం' అని చెప్పా. ఈ ట్యూన్‌ నచ్చడం వల్ల సిరివెన్నెల గారు చక్కటి సాహిత్యంతో పూర్తి పాటను అందించారు. తర్వాత దీనికి రెండో ట్యూన్‌ కూడా సిద్ధం చేశాడు తమన్‌. నిజానికి త్రివిక్రమ్‌ దానికే ఓకే చెప్పారు. కానీ, నేను మాత్రం మొదట విన్న దానికే ఫిక్స్‌ అవుదామని చెప్పా. మరో విషయం ఏంటంటే.. ఈ లిరికల్‌ గీతాన్ని తొలుత ఎలా విడుదల చేద్దామనుకున్నప్పుడు.. లైవ్‌ మ్యూజిక్‌లా వీడియో రూపంలో విడుదల చేద్దామని చెప్పింది మాత్రం త్రివిక్రమే. ఈ విషయంలో మాత్రం క్రెడిట్‌ అంతా ఆయనకే ఇవ్వాలి" అని ఆ పాట పుట్టుక వెనకున్న కథను చెప్పుకొచ్చారు స్టైలిష్‌స్టార్‌.

ఇదీ చదవండి:జోరుగా 'టక్ జగదీష్‌' చిత్రీకరణ

ABOUT THE AUTHOR

...view details