రాబోయే సంక్రాంతికి టాలీవుడ్ హీరోలు మహేశ్‌బాబు, అల్లు అర్జున్ మధ్య పోటీ నెలకొంది. జనవరి 12నే తమ రెండు సినిమాలను తెస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. పెద్ద చిత్రాలు ఒకేరోజు వస్తే థియేటర్లు సరిపడకపోవచ్చని, కలెక్షన్లు అనుకున్నంత మేర రాకపోవచ్చని పలువురు సినీ పండితులు అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడీ సమస్యకు పరిష్కారం దొరికింది. ఇరు సినిమాల నిర్మాతలు మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకున్నారు.
పండగ రేసులో ఒకరోజు ముందే వస్తున్న మహేశ్‌బాబు - MAHESH BABU SARILERU NEEKEVVARU
నిర్మాతల మధ్య కుదిరిన సయోధ్య కారణంగా మహేశ్‌బాబు 'సరిలేరు నీకెవ్వరు' విడుదల తేదీ మారింది. అనుకున్న తేదీ కంటే ఒకరోజు ముందే ప్రేక్షకుల ముందుకు రానుంది.
మహేశ్‌బాబు-అల్లు అర్జున్
మహేశ్‌బాబు.. 'సరిలేరు నీకెవ్వరు'ను ఒకరోజు ముందు అంటే జనవరి 11నే తీసుకురానున్నట్లు తెలిపారు. బన్నీ.. 'అల వైకుంఠపురములో' సినిమా జనవరి 12నే రానుంది.
ఇవే కాకుండా రజనీకాంత్ 'దర్బార్' జనవరి 10న, నందమూరి కల్యాణ్‌రామ్ 'ఎంతమంచివాడవురా'.. జనవరి 15న రానున్నాయి.