హీరో అల్లు అర్జున్- దర్శకుడు కొరటాల శివ కాంబోలో రానున్న సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాను 2022 సమ్మర్ రిలీజ్‌కు ప్రణాళిక రచిస్తున్నట్లు ఓ పోస్టర్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా షురూ చేసినట్లు ఈ పోస్టర్లో ఉంది. అయితే ఈ అప్డేట్ గురించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
నటకిరీటి రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన 'క్లైమాక్స్' సినిమా విడుదల తేదీని ఖరారు చేసింది చిత్రబృందం. ఫిబ్రవరి 27న రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ చిత్రాన్ని భవాని శంకర్ తెరకెక్కించారు.
హీరో గోపీచంద్- సంపత్ నంది కాంబోలో తెరకెక్కుతోన్న 'సీటీమార్' సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 22న ఉదయం 10.36 గంటలకు విడుదల చేయనున్నారు. ఇందులో గోపీచంద్ ఆంధ్ర కబడ్డీ జట్టుకు కోచ్‌గా, తమన్నా తెలంగాణ జట్టుకు కోచ్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మరో కథానాయికగా దిగంగన నటిస్తోంది. పోసాని కృష్ణమురళి, రావు రమేష్, భూమిక, రెహమాన్ తదితరులు కనిపించనున్నారు.