తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తమిళంలో రీమేక్​ కానున్న శ్రీ విష్ణు చిత్రం! - తెలుగు సినిమా వార్తలు

టాలీవుడ్​ హీరో శ్రీ విష్ణు నటించిన 'బ్రోచేవారెవరురా' త్వరలో తమిళంలో రీమేక్​ కానుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

brochevarevarura movie remake at tamilanadu
తమిళ్‌లో రీమేక్​ కానున్న శ్రీ విష్ణు చిత్రం?

By

Published : Dec 9, 2019, 9:01 PM IST

టాలీవుడ్​లో హిట్ సినిమాలు తమిళంలో రీమేక్​ కావడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పుడీ జాబితాలోకి శ్రీ విష్ణు 'బ్రోచేవారెవరురా' చేరింది. కామెడీ ప్రధానంగా రూపొందిన ఈ చిత్రంలో నివేదా థామస్​, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఇతర పాత్రలు పోషించారు. వివేక్ ఆత్రేయ దర్శకుడు.​ ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద మంచి విజయం అందుకొని, విమర్శకుల ప్రశంసలందుకుంది.

ప్రస్తుతం సినిమాను తమిళం​లో రీమేక్​ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించే ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభించినట్లు సమాచారం. త్వరలోనే అధికార ప్రకటన వెలువడే అవకాశముంది.

ఇదీ చూడండి : ఉన్నావ్ ఘటనలో ఏడుగురు పోలీసులపై సస్పెన్షన్​ వేటు

ABOUT THE AUTHOR

...view details