తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఓ దర్శకుడు.. హీరోయిన్​.. 3 పాత్రలు.. - వివేక్ ఆత్రేయ

శ్రీవిష్ణు కొత్త సినిమా 'బ్రోచెవారెవరురా' టీజర్ విడుదలైంది. చిత్ర కథాంశం సినిమా నేపథ్యంలోనే ఉండనుంది. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఓ దర్శకుడు.. హీరోయిన్​.. మూడు పాత్రలు..

By

Published : Apr 20, 2019, 1:46 PM IST

విభిన్న సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్న యువ హీరో శ్రీవిష్ణు. ప్రస్తుతం 'బ్రోచేవారెవరురా' చిత్రంలో నటిస్తున్నాడు. ఈరోజు విడుదలైన టీజర్​ ఆకట్టుకునేలా ఉంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ అభిమానుల్లో ఆసక్తి రేపుతున్నాయి.

నివేదా థామస్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటించారు. సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. వివేక్ సాగర్ సంగీతమందించాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. శ్రీవిష్ణుతో ఇంతకు ముందే 'మెంటల్ మదిలో' అనే చిత్రాన్ని తెరకెక్కించాడీ దర్శకుడు. జూన్​లో ఈ సినిమా విడుదల కానుంది.

ఇది చదవండి: 'వీలైతే భూమిని ప్రేమిద్దాం డూడ్.. పోయేదేముంది?​'

ABOUT THE AUTHOR

...view details