హాలీవుడ్ ప్రముఖ నటుడు నిక్ కోర్డియో(41) మృతి చెందాడు. ప్రాణాంతక కరోనాతో దాదాపు 95 రోజులు పోరాడి తుదిశ్వాస విడిచాడు. ఈ విషయాన్ని అతడి భార్య అమండ క్లోట్స్, సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
"స్వర్గానికి మరొకరు చేరుకున్నారు. ప్రియమైన నా భర్త ఈరోజు ఉదయం మరణించారు. ఈ లోకాన్ని అతడు విడిచి వెళ్లేముందు మా కుటుంబం అంతా ఎంతగానో ప్రార్ధించాం. నిక్ మమ్మల్ని విడిచివెళ్లడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను. అతడు లేకుండా జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాను. నేను ప్రతిరోజూ నిక్‌ను మిస్ అవుతూనే ఉంటాను" -అమండ క్లోట్స్, నిక్ సతీమణి