తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సర్దార్​ ఉద్ధమ్​ సింగ్'​లో బ్రిటన్​ నటి - తెలుగు సినిమా తాాజా వార్తలు

సుజీత్​ సర్కార్​ దర్శకత్వం వహిస్తున్న 'సర్దార్​ ఉద్ధమ్​ సింగ్'​ చిత్రంలో పంజాబ్​ సంతతికి చెందిన  బ్రిటన్ నటి బనితా​ సంధూ హీరోయిన్​గా నటించనుంది. ఈ సినిమాలో విక్కీ కౌశల్ కథానాయకుడు.

'సర్దార్​ ఉద్దమ్​ సింగ్'​లో బ్రిటన్​ నటి

By

Published : Nov 20, 2019, 7:24 PM IST

బాలీవుడ్​ దర్శకుడు సజీత్​ సర్కార్​ దర్శకత్వంలో రూపుదిద్దుకునే 'సర్దార్​ ఉద్ధమ్​ సింగ్'​ చిత్రంలో పంజాబి సంతతికి చెందిన బ్రిటన్​ నటి 'బనితా​ సంధూ' అవకాశం దక్కించుకుంది. 'ఉరి' సినిమా ఫేమ్​ హీరో విక్కీ కౌశల్​ ఈ మూవీలో కథానాయకుడు. సుజీత్​ సర్కార్​ డైరెక్షన్​లో ఇంతకుముందు 'అక్టోబర్'​ సినిమాలో వరుణ్​ ధావన్​కి జంటగా నటించింది సంధూ.​ఈ చిత్రంతోనే తన ఎంట్రీ జరిగింది. ఇప్పుడు మరోసారి సర్కార్​ దర్శకత్వంలో నటించనుంది.

సర్దార్‌ ఉద్ధమ్ సింగ్‌' జీవితాధారంగా వస్తున్న చిత్రంలో చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఇప్పటికే కొన్ని సన్నివేశాలను పంజాబ్‌ ప్రాంతంలో చిత్రీకరించారు. మరోసారి 'అక్టోబర్‌' చిత్రబృందంతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది.

-బనితా సంధూ, సినీ నటి

ఇప్పటికే సంధూ​ తమిళంలో విక్రమ్‌ తనయుడు ధ్రువ్‌తో కలిసి 'ఆదిత్య వర్మ'లో నటించింది. ఇది తెలుగులో వచ్చిన 'అర్జున్‌రెడ్డి' సినిమాకు రీమేక్‌. గిరీసాయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది కూడా చదవండి:హైదరాబాద్‌ దాదాలపై వర్మ సినిమా

ABOUT THE AUTHOR

...view details